అండదండ అందించే అధినాయకుడిగా
ఆవేదనను ఆయువును ఆదమరిపించేలా
ఇతిహాసాలను ఇప్పుడిప్పుడే ఇష్టపడేట్టుగా
ఈలవేసిన ఈదురుగాలి ఈర్ష లెన్నో వున్నాయి
ఉగ్గుతో నేర్పిన విద్యో అది ! ఉడతా భక్తో మరి
ఊర్లు అన్ని ఊయలలో ఊలలాడినట్లుగా
ఋతుచక్ర ఋతువులన్నిఋగ్వేదoలో లీనమై
ఎట్టకేలకు ఎదురుగా వచ్చి ఎదురైనాయీ నేడు
ఒంటరితనంలో ఒడిదుడుకులన్ని ఒకటైనాయీ
కలవరపడిన కల్మషాల కల్పితాలన్ని కూడా
గడ్డుకాలంలో గట్టితనంతో గగ్గోలపెట్టే విధంగా
చతికిలపడినాయీ చలామణియైన చమత్కారాలు
టక్కున లేచిన టక్కరి మోసం " టపీ" మన్నట్టుగా
తామర తుంపరలుగా తుమ్మెదల వలసలు ఎన్నో
నడివీధిన నాట్య మాడేట్టుగా నటిస్తున్నాయీ ఏంటో?
ప్రకృతిని పరవశింపజేసే ప్రసార సాధనం ఏమో అది.
No comments:
Post a Comment