Friday 24 October 2014

నా సింహాసనం

   నా సింహాసనం

ఉపద్రవం ముంచుకొస్తుందని తెలిసింది నా తనువుకి 

అనుగ్రహం కొరకు ఎదురుచుస్తున్నాయీ నయనాలు 
నిగ్రహం పాటించే తీరిక లేదు ఎందుకో మరి నాకు 
బహుశా ! నా జీవితం రెండంచుల ఖడ్గం కావోచ్చు .

ఆకాశపు ఎత్తు కొలవాలనుకునే అర్భకుడిని  నేను

భుమిలోతు  పరిశీలించే పిచ్చి మనసు నాది 
పొద్దుపోయీన తరువాత కూడ పోరాడే పటిమ నాది 
వేటగాడి  నుండి తప్పించుకున్న లేడి బ్రతుకు ఇది

కణకణలాడే  నిప్పులా  నా కన్నీరు మరుగుతుంది 

మహత్వం  చేసే  మహోన్నతుడున్నాడని దైర్యం నాది
విజ్ఞాపన చేయటం తప్ప బలవంతం చేయలేను 
విగ్రహాలను నమ్మేతత్వం  నేడు రూపుమాసింది  నాలో 

గాలికి కదిలే అడవి చెట్లలా నా ప్రాణం అల్లాడుతుంది

ముండ్ల పొదలో దాగిన చిన్న ప్రాణిలా పడివున్నాను
గడ్డిబీళ్ళ వలె నా బ్రతుకు వుందని తెలిసింది నేడు 
సింహాసనాన్ని ఎక్కించే ఘడియ ఏర్పరచాడు నాకు 

No comments: