
బోసినవ్వుల పసిపాపనో
పరిమళించే పువ్వునో
చిగురించే వసంతానివో
దారి చూపించే వెలుగువో
దరి చేర్చే రక్షకుడవో
సాహిత్యాన్నికి చరణానివో
పాడే పాటకు పల్లవివో
కవిత్వమందించే కవివో
ఉదయీoచే తొలి సంద్యవో
పరుగిడే ప్రగతి చక్రానివో
రచయితలో దాగివున్న రహస్యానివో
విది నిర్వహణలో విదేయుడవో
ప్రక్షాళణ చేసిన ఉపాధ్యాయుడవో
ఉడుకు నెత్తుటి యువతవో
ప్రాణం పోసిన వైద్యుడవో
ధైర్యాన్ని అందించే స్నేహితుడవో
బాధలను భరించ దల్చిన భర్తవో
సమస్యలను సాదించగల భార్యవో
గుండెపై అలసట తీర్చగల ప్రియురాలివో
నీతి కథలు నేర్పుతున్న నానమ్మ వో
సుస్వరాలు అందించగల కోకిలవో
అన్నమందించే అన్నదాత వో
ఆశ్రయం ఇచ్చిన అమృత మూర్తివో
ప్రేమామ్రుతాన్ని అందించిన "అమ్మ"వి అనుకుంటా
No comments:
Post a Comment