Tuesday 11 November 2014

రారాజు

            రారాజు గురి లేని నాడు గమ్మత్తు గా వుంటుంది.
సరి తేల్చుకునే రోజు దరిద్రం వెక్కిరిస్తుంది.
సమయం భవిష్యత్ వైపు పరిగెడుతూ,
పనికి మాలిన ఆలోచనల్ని రేపుతుంది.

సహకరిస్తారనుకున్న వాళ్ళు సందేహామైనారు.

ఆత్మీయులనుకున్న  వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఎగిసి పడుతున్న కెరటాన్ని చూస్తే చాలదు?!
ప్రయత్నిస్తు పరుగులు  పెట్టాలి  ఇక నువ్వు.

అవకాశo కోసం ఎదురుచుడకు మిత్రమా !

తూట్లు పడుతున్న నీ మనసే నీ నేస్తం.
అవమానాలను ఆభరణాలుగా మార్చుకో ,
ఒకరి తోడు ఎందాక? ఒకరి నీడ ఎందాక?.

రానున్న భవిత కోసం రారాజు నువ్వే కావాలి .

వెంట వస్తున్న నీ ఆత్మీయులను గుర్తించు 
ఆకరి క్షణం వరకు సమయాన్ని విడవకు 
ఒక్క క్షణం లో అదృశ్యమవ్వాలి నీ గత జీవితం.

Monday 3 November 2014

సాధించాలి అనే తపన



అన్ని వుంటే సాధించటం,గెలవటం గొప్ప కాదు.నీకున్న వాటిలో గెలవటం గొప్ప.చరిత్ర లో నిలవడం గొప్ప,నీదమ్ము చూపించు ఈ లోకానికి


     మెల్లగ ,మెల్లగ ,మెల్లగ ఐన సాగనీ పయనం.కానీ వెనుకకి మాత్రం అడుగేయకు.ఫలితం వద్దు,ప్రయత్నం మరవద్దు-  RFY SEYNA VIJAY



Wednesday 29 October 2014

నీ నిష్క్రమణ

    నీ నిష్క్రమణ

ఏకాంతంలో  వున్న  నా  తనువుకి  


నిర్మానుష్యమైన   అలజడిలా...


ఆవరించేను    అనుభూతులు 

తడబడు  అడుగులుగా ,  సుడులుగా



పిడికెడంత  ఈ  పిరికి  గుండెకు  సైతం 


మసక  తెరల  వేకువను  చీల్చి  వేస్తూ


నా  వెన్నంటే  వుండే  అదృశ్య  హస్తాలు


అస్తమానం  ఆదరిస్తున్నా  తరుణం  ఇది.



ఈ  జీవిత  వైవిధ్య  రీతులకు  లోబడి 


రెండు  కన్నీటి  బొట్లు  రాలుస్తూ ...


జరిగిన  యాదృచ్చిక  సందర్బంలో 


నా  జీవితం నుండి  నిష్క్రమించిన  "నిష్" కళంకిత !


Tuesday 28 October 2014

నీ మహోత్తర నిమిషం

  నీ మహోత్తర నిమిషం

దురవ్యసనాల  మత్తులో  చేసిన  దుష్టాలోచన క్రియలన్ని, 

మానసిక  వేదనకు  తటస్థపడి  నన్ను బలి చేశాయీ .


క్రూరత్వంతో  చేసిన  క్రియలన్ని నన్ను కల్లోల పరిచాయీ.


క్షీణిoచే  తనువుకు పరిమిళిoచే వాసన ఏంటో మరి ?!!


అగాధ లోయల్లో అద్బుతాలు చేస్తున్నట్టుగా నీవు నాకు, 


మహోత్తర నిమిషంలో మనసుకు కళ్ళెం వేశావు.


అగ్ని జ్వాలల్లో, ఆహుతి చేసుకునే ఆలోచనలతో ,


నా కపటోపాయలన్నిటిని భస్మం చేశావు.



నా దుష్టాత్మను నశింపజేసే శక్తి  నీకేవుంది


సుఖ ప్రాప్తిని అనుగ్రహించే సత్పురుషుడవు నీవే


ఊభి అనే లోకంలో   మునిగిన నన్ను పైకి లేపింది నువ్వే


నా ప్రాణ భీతిని అధమరిపించింది నీవే కదా! 



జన సముహాన్ని  రక్షించే ఓ మా ప్రాణదాతా!


చివరి వరకు  నే  ప్రదర్శించిoది  ప్రతికారమే


నీ , దివ్య ప్రచండ వాయువులను నాపై నిల్పావు


నా ద్రుష్టినంతటిని నీపై మరల్చగలిగిoది నీవే!!



నా ప్రేమ బంధం

   నా ప్రేమ బంధం 

బంధించబడిన  నా ప్రేమ బంధాలు తుణకలైనాయీ,


నా జీవిత  అంకం  ముగిసిందని నిర్ధారణకు  వచ్చి,


సమస్త  వ్యసనాలన్ని  వదిలేసిన  ఆ ఘడియన, 


ఆశ్చర్యం  వ్యక్తం చేసింది,   నా దిగంబర తనువు.


అమూల్యమైన  ఆప్యాయతలకు  లోబడిన నా ప్రాణం 


ఆనందసాగరంలో  మునిగిన నా అనుభూతులన్ని


జీవిత యాత్ర  నుండి  మేల్కొని  అర్దించినపుడు


స్మశాన  వాటికకు  మధుర యాత్రను  జరిపాయీ.



ఎంతో  కొంత  తృప్తితో   సంబరపడిన  నా చావు 


వ్యామోహ  సుడిల  నుండి  బయటకు  విసిరినపుడు


ప్రశాంతత  నిచ్చేoదుకు  భగవంతుడిచ్చిన  వరం 


విధ్వంసం  సృష్టించే  భయంకర  మరణము .


ఇది ఒక్కసారిగా  వచ్చిన నా మరణ తుఫాన్


పరిగణనలోకి రానివ్వని  విపత్కర పరిస్థితుల్లో 


తొణికిసలాడిన  పెదవుల  చివరి  పలుకు 


"నా మాతృమూర్తి"కి మానసిక "శాంతి "ని ఇవ్వు.

Monday 27 October 2014

నా శాంతి

      నా శాంతి

కంచెను నమ్ముకుని  చేను బ్రతుకుతుంది 


వర్షాన్ని నమ్ముకుని రైతు బ్రతుకుతున్నాడు


దేవున్ని నమ్ముకుని భక్తులు బ్రతుకుతున్నారు


గుళ్ళను నమ్ముకుని పూజారులు బ్రతుకుతున్నారు


సూర్యరశ్మి ని నమ్ముకుని మహావృక్షాలు బ్రతుకుతున్నాయీ 


రాజకీయాలను నమ్ముకుని నాయకులు బ్రతుకుతున్నారు


విద్యను నమ్ముకుని విద్యార్ధులు
బ్రతుకుతున్నారు 

ప్రభుత్వాన్ని నమ్ముకుని ప్రజలు 

బ్రతుకుతున్నారు 

కులాలను నమ్ముకుని  కుల పెద్దలు బ్రతుకుతున్నారు


ప్రేమను నమ్ముకుని ప్రేమికులు బ్రతుకుతున్నారు


వ్యవస్థను నమ్ముకుని వివేకులు బ్రతుకుతున్నారు


డబ్బును నమ్ముకుని దరిద్రులు బ్రతుకుతున్నారు 


శ్రమను నమ్ముకుని శ్రామికులు బ్రతుకుతున్నారు 


జ్ఞానాన్ని నమ్ముకుని జ్ఞానులు బ్రతుకుతున్నారు 


న్యాయాన్ని నమ్ముకుని ధర్మదేవత  బ్రతుకుతుంది


బిడ్డల్ని నమ్ముకుని తలిదండ్రులు  బ్రతుకుతున్నారు 

ప్రాణాన్ని నమ్ముకుని జీవప్రాణి బ్రతుకుతుంది


నమ్మకాన్ని నమ్ముకుని నమ్మకం బ్రతుకుతుంది 


కానీ!!!!!!!!!!!!!!!



"విజయ్ " ని నమ్ముకుని "నా శాంతి " బ్రతుకుతుంది .

Sunday 26 October 2014

నా మిత్రుడు

    నా మిత్రుడు 
సముద్రపు విశాలత సరిరాదు నాపై నీకున్న ప్రేమకు 

ఏం ఇవ్వగలను  నీకు? ఏం చేయలేని  దీనస్థితి


పరిస్థితులన్ని కూడ ప్రళయాలను సృష్టిస్తున్నా


ప్రళయదినం వచ్చేప్పుడు  కూడ ప్రక్క నుండే స్వభావం 


కలవరపడిన  కన్నులకు కంటతడిని ,భలే దాచావు


నీ చిన్ని హృదయానికి  భాoదావ్యాలు ఎన్నో వున్నా 


నా కంటు ఓ ప్రత్యేకత ఇచ్చిన పసితనపు మనసు నీది


నా ప్రక్కన నీ తోడు వుండే ఆ ఆనంద సమయాన 


మాటలు రాని మహోత్తర క్షణాలు కల్లోల మైనాయీ


నా సర్వం నీకు ధారపోయాలనే ఓ పిచ్చి ఆలోచన 


నీరసించిన  నీ హృదయంతో  ఉత్యాహం  నాకిచ్చావు 


చిమ్మ చీకటి రాత్రి వేళ కూడ  మా కోసం వచ్చావు 


చీవాట్లు ఎక్కుపెట్టినా కూడ నా ఎదురు నిల్చావు


నీ గుండెలో గూడు కట్టుకున్న ఆవేదనను దాచావు 


నా తరం ముగిసినా నీ ప్రేమ నా ఇంటిపై చూపించు


దేవుడేర్పరచిన స్నేహ బందాన్ని నిజం చేయీ


నా జ్ఞానోదయం

  నా జ్ఞానోదయం

వ్యామోహ  వ్యవస్థలో  ఒకనాడు 
నే చేసిన  తొలి ప్రయత్నం  వెక్కిరించి 
సంధర్బోచితమైన  సంఘటనలుగా
మానవీయతకు అభ్యంతరం చేశాయీ

మానసిక హింసాత్మక చర్య ఏమో 
తనువు కలవరపడింది  అనుకుంటా 
సంకుచితంగా వ్యవహరించిన ఓ నిజం 
నా వెన్నంటే  వుంటుంది , ఓ దురదృష్టంలా 

అది నరాలు మెలివేసే సమస్య ఐనా
ఒక్క హృదయం మినహాయింపు తప్ప 
శరీర అంగాంగాలు  దోహదం చేశాయీ
అది పరిపూర్ణ జ్ఞానోదయం అని తేల్చాయీ

సద్వినియోగ పరచలేని సంఘటనలు 
కారణభూతం కాని కారణాలు వేలుగా 
నా ప్రస్థానానికి ప్రత్యేక ముద్ర వేశాయీ
ఈ క్షణం వరకు ఆనంద భరితం చేశాయీ

Saturday 25 October 2014

నా మనస్తాపం

    నా మనస్తాపం

నా విషాద  గీతం  విస్మరింపజేసి

వింత కాంతి  నా గుండెలో  మిగిల్చి 
ముళ్ళ పాన్పు ఐన నా గమ్యం లో
మృగ రాజు లా మిగిలానునేడు

"ఊ" కొట్టే ఉదార వాదులు

"ఛీ "కొట్టే చాంధస వాదులు 
ఎదురయ్యే  ప్రతి  ప్రశ్నకు 
నా  విజయమే  ఓ తార్కాణం

రుగ్మతల ఈ తనువుకు 

సహకరించని సమయానా 
ప్రతిబింబించే అవమానాలను 
నా సాహసం సమర్దించ గలదా ?

శ్రమను ఆయుధముగా చేర్చి 

అవస్థలను  ఆభరణాలుగా  మార్చి 
సమస్యను సమన్వయం చేసిన వేళ
 అందుకో నా మనస్తాప కరతాళ ధ్వనులు 

రేపు నా ప్రస్థానం

  రేపు నా ప్రస్థానం

తీరం  చేరాలనుకున్న  నా ప్రస్థానం

 తిమరంలో  కలిసిన  వేళ!

ప్రకృతిలో  ప్రతి నూతనం  అసత్యాన్ని 

 ప్రతిధ్వనిస్తున్న వేళ

ఆకాశ హర్మ్యాలలో వున్న నా మనసు  అస్థికలుగా  మారిన  వేళ


నీపై  నిందలు నిజమా?! అనే సందేహం 

నాకు  సహకరించని  వేళ

జగతికి  జ్యోతినిస్తు ఆహుతి 

అవుతున్న సమిధలా !

క్షణక్షణం  పరితపిస్తూ 

పరదేశినైనా  నీ తోడు లేక !     

నా చమత్కారం

        నా చమత్కారం

అండదండ  అందించే అధినాయకుడిగా 

ఆవేదనను  ఆయువును  ఆదమరిపించేలా 
ఇతిహాసాలను  ఇప్పుడిప్పుడే  ఇష్టపడేట్టుగా 
ఈలవేసిన  ఈదురుగాలి  ఈర్ష లెన్నో  వున్నాయి

ఉగ్గుతో నేర్పిన విద్యో అది ! ఉడతా భక్తో మరి 

ఊర్లు  అన్ని  ఊయలలో  ఊలలాడినట్లుగా 
ఋతుచక్ర  ఋతువులన్నిఋగ్వేదoలో లీనమై
ఎట్టకేలకు ఎదురుగా వచ్చి ఎదురైనాయీ నేడు 

ఒంటరితనంలో ఒడిదుడుకులన్ని ఒకటైనాయీ

కలవరపడిన కల్మషాల కల్పితాలన్ని కూడా 
గడ్డుకాలంలో గట్టితనంతో  గగ్గోలపెట్టే విధంగా 
చతికిలపడినాయీ చలామణియైన చమత్కారాలు

టక్కున  లేచిన  టక్కరి  మోసం " టపీ" మన్నట్టుగా 

తామర  తుంపరలుగా  తుమ్మెదల  వలసలు  ఎన్నో
నడివీధిన  నాట్య  మాడేట్టుగా నటిస్తున్నాయీ ఏంటో?
ప్రకృతిని  పరవశింపజేసే  ప్రసార సాధనం  ఏమో అది.

నా ఆయుధం

   నా ఆయుధం
శౌర్యమెంతున్నా చివరకు అందరము శవాలమే 
ఉగ్రతను అణుచుకోగల తత్వం నీ వశమైతే
నరక యాతనలు వున్నా కెరటంలా లెగవాలి
కలవరపడక కలలను సాకారం చేసుకోవాలి 

తలచిన ప్రతిక్రియ నీకు స్వాగతం పలికేలా 

సుడి తిరుగు ధూళి, సువాసనలుగా మారాలి 
తొలకరి వానకు ముగ్దులైన మహావృక్షాలన్ని
అగ్ని జ్వాలలకు ఆహుతి అవుతున్న సమయం ఇది

నీ కీర్తి కంటిన దోషాన్ని క్షీరంతో ప్రక్షాళన చేసి 

నీ జ్ఞాపకాలను పోతపోసిన విగ్రహంలా మార్చాలి 
పాపపుణ్యాలను లెక్కేడుతు కాలం వృధా చేయకు 
శరీర పుష్టిలో  వివేకానందుడే ఆదర్శం నీకు ఇక

గర్విష్టి అని పిల్చిన ప్రతివాడు ఆశ్చర్యం పొందేలా 

మనోవేదనకు  ముందు దొరికేలా ప్రయత్నించు 
విషం కక్కే నరులు వీళ్ళు తొలి ప్రయత్నం నీదే
శ్రమ మాత్రమే నీ ఆయుధం! ఫలితం ధైవదీవనలే!!

నా నిశీధీ వేగు చుక్క

 నా నిశీధివేగుచుక్క

అణువణువు తన ప్రేమతో తనకీ చేస్తు

సమస్యల బందోబస్తు మధ్య వున్న  నా చెలి
తనకందని ద్రాక్షలాంటి తాయీలాలు ఎన్నున్నా
నా దౌర్భాగ్య ధీన స్థితిని ధ్వంసం చేస్తానంటుంది 

తెలుగు వాడి సంప్రదాయాలకి ప్రతీకగా వుండే 

ఆమె విలువైన కుల గౌరవ ప్రతిష్టలనొదిలింది మా కోసం 
తన ప్రేమలో కనిపించే  స్వచ్చమైన అమాయకత్వం 
కొన్నివేల  మానవ సంబంధాలకు  దీపం కాబోతుంది 

అనుబంధాల్ని ఆకట్టుకునే తన ప్రయత్నంలోను

మనుగడలేని  అంధకార మా మహాలయంలోను 
ఏం చేయదల్చిందో తన మహత్తర మాయాజాలంతో
మా జీవితాలను అదృష్టంగా దాసోహం చేసినాము 

ఆప్యాయత  మబ్బులను మాకు తెలియపరచి 

మనసులకు , మనుషులకు  కీలక పాత్ర  ఐoది 
నిత్య నూతనం ప్రతి వసంతo కావాలని కోరుతూ 
బహుకరిస్తున్నా నేడు "నా నిశిది వేగుచుక్క"అని 

Friday 24 October 2014

నా సింహాసనం

   నా సింహాసనం

ఉపద్రవం ముంచుకొస్తుందని తెలిసింది నా తనువుకి 

అనుగ్రహం కొరకు ఎదురుచుస్తున్నాయీ నయనాలు 
నిగ్రహం పాటించే తీరిక లేదు ఎందుకో మరి నాకు 
బహుశా ! నా జీవితం రెండంచుల ఖడ్గం కావోచ్చు .

ఆకాశపు ఎత్తు కొలవాలనుకునే అర్భకుడిని  నేను

భుమిలోతు  పరిశీలించే పిచ్చి మనసు నాది 
పొద్దుపోయీన తరువాత కూడ పోరాడే పటిమ నాది 
వేటగాడి  నుండి తప్పించుకున్న లేడి బ్రతుకు ఇది

కణకణలాడే  నిప్పులా  నా కన్నీరు మరుగుతుంది 

మహత్వం  చేసే  మహోన్నతుడున్నాడని దైర్యం నాది
విజ్ఞాపన చేయటం తప్ప బలవంతం చేయలేను 
విగ్రహాలను నమ్మేతత్వం  నేడు రూపుమాసింది  నాలో 

గాలికి కదిలే అడవి చెట్లలా నా ప్రాణం అల్లాడుతుంది

ముండ్ల పొదలో దాగిన చిన్న ప్రాణిలా పడివున్నాను
గడ్డిబీళ్ళ వలె నా బ్రతుకు వుందని తెలిసింది నేడు 
సింహాసనాన్ని ఎక్కించే ఘడియ ఏర్పరచాడు నాకు 

Thursday 23 October 2014

నా దైర్యం

   నా దైర్యం 

త్రిమూర్తులు సైతం తిక మక పడిన కూడ

నవగ్రహాల్లోనాకు స్థానం  లేక పోయీన 
పంచేంద్రియాలు చలించక పోయీన
సప్తస్వరాలు సవ్వడి మార్చలేక పోయీనా

మహా సాగరం లో ముత్యం లా

మహారణ్యం లో మృగ రాజు లా
మల్లెల పాన్పు నీకు పరుస్తూ 
ఒక్కసారిగా ప్రకృతే పరవశిస్తూ

ఉల్లాస భరిత ఉస్తవ వేడుకలా 

వందల వేల కరతాళ ధ్వనుల మద్య
నీ చరితను స్మరించు కుంటూ
జీవరాసులన్నీ నీకు సలాం కొట్టాలి

ఎందరికో మార్గ దర్శకుడిగా 

ఎలుగెత్తి చూపే నీ దైర్యం లో
ఆనంద భాష్పాల అమృత గడియల్లో
పులకరించాలి నీ ప్రతి ఆణువణువూ.

నా చంద్రవంక

   నా చంద్రవంక 

ఆందోళన లేని అందమైన మోము వున్న చిన్నది 

భీకరంగా హెచ్చరించ దలచి అడిగిన , 
గడియన 
అది సందేహాస్పదమే ! అనే ఆలోచనల నడుమన 
ఏమైoదో మరి తిరిగొచ్చిoది తన పూర్వ వైభవం 

గత్యంతరం లేని గమ్యస్తానం , అది అనుకుంటు

మరచిపోలేని ప్రయాణాల  అడుగుజాడలనుకుంటు,

ఇంకా చిరుప్రాయంలోనే వుంది ఎదిగిన ఓ కొమ్మ 

తన ఛాయతో నన్ను నిర్బందించి ముగ్దుడిని చేసింది

భార సహిత భయంకర సమస్యల నడుమనవున్నా

అతలాకుతలమైన జీవితపు నావ అనే గమ్యంలో 
సంకల్ప సిద్ది నుండి ఏర్పడిన ఓ మహాసంకల్పము 
కాలచక్ర దిక్కులు ప్రిక్కటిల్లేట్లు ఘీంకరించింది 

నేర్చలేని మాయ మర్మాలను సైతము , నేర్చుకుని 

ఆనవాళ్ళు కూడ తెలియని అద్భుత శక్తుల్లో
పదివేలల్లో వున్నఆశ్చర్య పరిచే ఒక ప్రముఖరాలు .
నా మనసంటోoది  అది ఓ అందాల " చంద్రవంక "

Wednesday 22 October 2014

ఎవరు నీవు

         ఎవరు నీవు 

బోసినవ్వుల  పసిపాపనో 

పరిమళించే  పువ్వునో
చిగురించే  వసంతానివో 
దారి  చూపించే  వెలుగువో 
దరి చేర్చే రక్షకుడవో 
సాహిత్యాన్నికి  చరణానివో
పాడే  పాటకు  పల్లవివో 
కవిత్వమందించే  కవివో 
ఉదయీoచే  తొలి సంద్యవో
పరుగిడే  ప్రగతి  చక్రానివో
రచయితలో  దాగివున్న  రహస్యానివో 
విది  నిర్వహణలో  విదేయుడవో
ప్రక్షాళణ  చేసిన  ఉపాధ్యాయుడవో 
ఉడుకు  నెత్తుటి  యువతవో 
ప్రాణం పోసిన  వైద్యుడవో
ధైర్యాన్ని అందించే స్నేహితుడవో
బాధలను భరించ దల్చిన భర్తవో
సమస్యలను సాదించగల భార్యవో
గుండెపై అలసట తీర్చగల ప్రియురాలివో
నీతి కథలు నేర్పుతున్న నానమ్మ వో
సుస్వరాలు అందించగల కోకిలవో
అన్నమందించే అన్నదాత వో
ఆశ్రయం ఇచ్చిన అమృత మూర్తివో
ప్రేమామ్రుతాన్ని అందించిన "అమ్మ"వి అనుకుంటా

ఓ శతాబ్ద సంఘటన

ఓ శతాబ్ద సంఘటన    
చీకటి దారుల్లో వేతికాను 
ప్రేమ మాధుర్యం ఆస్వాదిద్దామని
పాదాలకు తగిలిన బోటు రాళ్ళేన్నో
పిరికెడు గుండెకు బాధని నింపాయీ

కాలం ఎందుకు కలవర పడిందో 

రాజధర్పాన్ని రెట్టింపు చేయాలని 
నా మనసుకి  జరిగిన వైపరిత్యానికి 
కంట తడి పెట్టిన మహోత్తర క్షణాలె న్నో

ఎదురుపడిన అపశృతులన్ని కలిసి 

జీవితాన్నేఒక్క కుదుపు కుదుపేశాయీ 
ప్రేమ అనే మహావృక్షం క్రింద కూర్చొని 
నేడు శాశ్విత  స్వేదదీరినాను  ఎంతగానో 

జటిల సమస్యలైన సందర్భాలు ఎన్నో ఉన్నా 

శతాబ్ద సంఘటనల భావం కల్గించాయి 
ఎదురైనా కల్పిత విషాద వర్ణాలున్నా అవి 
అంతిమంగా కప్పేది శ్వేత వస్త్రమే అనిమరిచా 

Tuesday 21 October 2014

నా వేగా శకటం

  నా వేగా శకటం 

ప్రయోగాలూ చేసినా ఫలితం రాని వేళల్లో

మస్తిష్కబోనులో దాచిన సంగతులు
ఇవి నరులకు శ్రేయస్కరమా అని అడుగగా
సందేహం లేని విగత వాదనలుగా మిగిలాయీ

కంట నరాలు కల్లోలమైనట్టుగా కదిలాయీ

మదుర క్షణాల్నిమరువలేని మనిషిగా
బ్రతికిన లక్షల క్షణాల్ని లేక్కపెదతుంటే
విష సాగరం ఈ జీవితం అని అర్ధంఐనది

ప్రభావం చూపని కొన్నివేల అనుభూతులు దృష్టికి కనరాని వందల విపత్కర పరిస్తితులు

పరిశోదించలేని మ్రుగామానవ వ్యక్తిత్వాలు
వర్తమానం లోకి వేగా శకటం లాదూసుకు పోయాయీ

బ్రతుకు పునఃనిర్మాణ అంకంలో తోంగిచుస్తే

నామనసుస్వరూపాన్ని వర్ణించలేని సమయంలో
చెప్పలేక సంభాశిన్చాదల్చుకున్న సంగటనలు వున్నా
నేడు వలస పోతున్నా శూన్య నిర్మల ఆకాశానికి.

నా జీవిత సహచరి

 నా జీవిత సహచరి

నా ప్రేమ తొలినాళ్ళలో,వెంటపడినా
తన తీయని స్పర్శ,అనుభవించాలని
ప్రతిక్షణం, పరితపించాను అలనాడు
ఓ క్షణమేనచాలు ,తనతో గడపాలని

సృష్టికర్తకు వినపడిందేమో? నా ఆకాంక్ష

తన జీవితానే నాకు అర్పించాడు.
నాతో నడిచే ,అడుగుల సమయంలో
నాకు అగుపడింది, ఓ శ్వేత సుందరిలా.

అగ్రవర్ణంమైనా ,నేను నీ జంట పక్షినంటు

ఈ శూద్రుని కోసం , బిక్షాటన చేసింది.
ఆకాశ చుక్కలు లెక్కించే అల్పుడికి
తన కన్నీటిచుక్కలు దాచిన శోక వనిత

నా జీవితమనే అంధకార పుస్తకములో

ఆమె మాటలు లేని మూగభావపు చివరిపుట
మౌన సందిగ్ధత తెలియని జీవిత సహచరి.
అందని క్షణాన అది నాకు స్మశాన యాత్ర 

Monday 20 October 2014

నా నేస్తం

 నా నేస్తం

అలసిన మనసుకు ఆయుధంలా
ఉరకలెత్తించిన ఓ మహాశక్తి
మరణమును కూడ మరిపించేలా
జీవితానికి పరిణితి తెచీన ప్రమిధ

తనువును తన్మయత్వంలో ముంచిన

ఈ విశాల విశ్వంలో అలుపెరుగని బాటసారి
తడబడే అడుగులకు నడకలు నేర్పి
నా గుండెపే రాలిన తోకచుక్క

చరిత్ర ఒడిలో మరుగున పడిన నాకు 

నూతనశకన్నీ ఆవిష్కరించిన నేస్తం
అల ఎప్పుడు నిల్చే చోటు అది కాదు అని 
తను రహస్యంగా రోదిస్తు, బోసి నవ్వు నాకిస్తు

మరుగుతున్న మనిషితనాన్ని నిదురలేపి 

విశేష ప్రశంసలందుకునే శుభారంభ వేళ
ఆత్మస్థైర్యాము నాకిచ్చి, అందని దూరలకేల్తవా
ఇది నీకు న్యాయమా?! నా నేస్తం!!!

నా ఆవేదన

  నా ఆవేదన


ఈ రణరంగ చదరంగంలో 
జీవం పోసిన మాతృమూర్తిలా !!
నా ఆలోచన పరిపక్వ దశలో 
జీవిత మార్గం చూపిన స్నేహస్ప్ర్తిర్తి

 సుడులు తిరిగే మరణబీతి ;

 ఆగంతకునిలా వెంబడిస్తున్నా
నిష్క్ర్మించే తరుణంలో 
నీ జ్ఞాపకాలలో ఉదయీస్తా!!

మలుపులు మెలికలు తిరిగే గమ్యంలో

గుండె బరువెక్కిన కన్నీటి వీడ్కోలు
ఇది పరిమళాల అంతిమ మజిలీ 
అదృశ్య శున్య సంబషణలలో

తెరవెనుక మిగిలిన నీడలా !

తనువు శిదిలావ్యస్థకు చేరుకున్నా
అలిసిన ఆఖరి శ్వాసకు మౌనంగా....
ఇది గుండె బరువెక్కిన "నా ఆవేదన" 

Saturday 18 October 2014

నా శాశ్వత విముక్తి

  నా శాశ్వత విముక్తి

పిచ్చి ప్రేమల్ని అలుముకున్న ఈ జీవితానికి,

కన్నీళ్ళ ప్రవాహం లో సంతోష దారుల్ని వెతికి
భరించలేని బందాల్ని సైతం భద్రం చేసే
ఆనంద నిలయం నుండి అసువులు భాస్తున్నా

ఎన్నో ప్రణాళికల గూళ్ళు అల్లిన రాతి మనసులో

ప్రాణ భీతి లో గుర్తొచ్చిన కర్తవ్యాలెన్నో
ఇన్ని ప్రాణాలనుభాదించిన భయలెన్నో
నమ్మిన పై వాడి పరిక్షలు తట్టు కోలేకున్న

తుది శ్వాస వరకు పంచ ప్రాణాలను తల్చుకుంటూ

తదనంతర తనువూ కి ఆశల పాన్పు ఆదమర్చి 
పరుగులు తీస్తూ ఒక్క క్షణం ఆగమంటుంది
నా గుండె చప్పుడుఎందుకో?కలవర పడుతూ

స్పందించాలని వున్నా స్పందనలేని ఈ జీవానికి

ఓ కోణంలో గుండెలు పగిలే ఆవేదన వైపు
మరోకోణంలో దుఖించే మరణ వేదనలో
ఈ పాపాదేహం శాశ్వత విముక్తి ఎలా పొదిందో.

Friday 17 October 2014

నా అభిమానం

           
   
 నా అభిమానం


తరించిన నయనాలకు తెలుసు
మనోరంజకము నీ తనువని

పలికిన పెదవులకు తెలుసు

చరిత్రలో సువర్నాక్షరం నీ పేరని

వానికిన మస్తిష్కానికి తెలుసు

మనఃశాంతి నిచ్చేది నీ చిరునవ్వు అని

పులకించిన ధరణికి తెలుసు 

ఈ శుభానికి కారణం నీ అడుగని

ఓడిన గెలుపు కి తెలుసు

 ఎదురయ్యే ప్రతి మలుపు నీ పిలుపని

యెనలేని అభిమానం చివరివరకు వసంతం 

వ్యధలకు సహనం హితులకు చంధనం

సమర్దతలో యోచనం నీ గమ్యానికి దిశా నిర్దేశనం

శతాధ శుభమే జరగాలని........ నీ అభిమాని


నా ప్రయత్నం

     నా ప్రయత్నం

అడుగడుగునా ఎన్నో అవాంతరాలు వున్నా

అలుపెరగక పోరాటం సాగించు
జారిపోయీనహృదయ అసహనానికి
నేను జీవచ్చవం కాదని నిరూపించు

నీ రక్త స్వేదంతో చేసే ఈ ప్రయోగం

నవశకనికి నాంది కావాలి నీ ఫలితం
నీలో ఉదయీన్చే వేల రావికాంతులు
ముచ్చెమటల మహోదయం తేవాలి

వేలమెదస్సుల కదలికలు అన్ని కూడా

నీ నామస్మరణం చేసే విదంగా
నీ చిత్తశుద్ది నైజాన్ని ప్రస్తుతించే వేళా 
దిక్కులు ప్రిక్కటిల్లె శబ్దతారంగాలవ్వాలి

సమస్త శక్తులున్న సమర్దుడిగా,రేపు

చరిత్రలో నిలిచే చరిత్రకారుడిలా
నింగినుండి రాలే పుష్పజల్లులకోసం
చివరి క్షణం వరకు ప్రయత్నించు.

నా కవిత

     నా కవిత

కడలి లో జనించిన నీరు 

కదాలిలో నే కలుస్తుంది
నే వేసిన నెల మీద అడుగు 
నీటి మడుగు అద్దం లో చూపి

హృదయానికి మోహం ఒకసారి

దేహానికి దాహం ఒకసారే
నా కవితలోని ప్రతి అక్షరం 
నవనాగరికపు మనిషి కి సాక్ష్యం

చెమ్మగిల్లిన కన్నుల కాంతుల్లో

ముడుతలు పడిన శిల్పం లా
కల్మషాల మురికి కుపం లో
విరిసింది ఓ మానవ్వత్వపు కలువ

తడి కన్నులు తుడిచే నా నేస్తం

సృష్టి చేసిన మంత్ర సిరి
వసంతాన్ని విస్మరించేటువంటి
నా కవిత!ఆగని జడివానా

నీ దుర్బర బ్రతుకు


 నీ దుర్బర బ్రతుకు


సిగ్గులేని బ్రతుకు గల ఈ నీ జీవితంలో

సొమ్మసిల్లి పడిపోయే నీ శరీరంతో 
సర్కారు దవాఖానా కు ధౌడు తీస్తున్నావు 

ప్రలోభ పెట్టె వాగ్దానాల నడుమన నటించి

తన ఎత్తుల జిత్తులతో ఎగరేసుకుపోయాడు నిన్ను
మద్యం మత్తులోఓటేసి నే భవితవ్యం కోల్పోయావు
ప్రాదాన్యం ఇస్తాడు అనుకుంటే బలి పశువును చేసాడు

వక్ర మార్గం లో సంపాదించే అక్రమార్జన ఎరుగాలేవు

అంతిమ దశలోఆశ్చర్యచక్తుడవి అవుతావు
వజ్రాయుధాన్ని ఐదు నోట్లకు అమ్మెసుకున్నావు
ఐదేళ్ళ పాలనలో అగుపించాడా ?ఐదుసార్లుఐనా

సేవ చేసే నాయకుడికి పదవిలో,మనిషి గుర్తోస్తాడా?

నిలతిసే రోజున ఐదు  నోట్లు యదకోస్తాయీ
ఎంచు కునే నాయకుడు వెన్నంటే వుండాలి
ఇకనైనా ఆ  దుర్బర బ్రతుకుకి పాతరేయీ

నా ఆకరి పలుకు

        నా ఆకరి పలుకు

గుండెలో నిండిన పిరికితనం

 రక్తంలో కలసిన గరళం లా
హృదయ స్పందనల బదులు
ఏదో అలజడి చేస్తుంది

నయనాల చూపు,పేదల పలుకు 

నాశిక శ్వాస,పాదాల పరుగు
నిదురించే నా స్వప్నం లో మరణపు అంచులు తాకుతుంది

రాజీ పడని రోజులు లెక్కలేనన్ని

గడ్డుగా వున్న గంటలు వేలకొలది
ఎదురు చూసే నిముషాలు లక్షల కొలది
ముందుకు కదలని క్షణాలు కోట్లకొలది

ఈ ఉద్విగ్న తరుణంలో నేను

అనంత దూరాలకు పయనిస్తూ ఇలా 
అల్లుకున్న ప్రేమ బండలకు,మనసారా
పలికే ఆకరి పలుకు "ఇక శెలవు".

నా కల్ప వృక్షం

     నా కల్ప వృక్షం

అజ్ఞాతం లో వున్నా నన్ను నిప్పు కణం చేసావు

గుడు కట్టు కున్న నా కన్నీళ్లకు అమూల్య లేపనం అద్దావు.

 అంధకార నా యాత్రలో ఆకస చత్రంలా నిలిచావు

ముగిసిందా అనుకున్న నా బ్రతుకు కి సంచలన లికిత ముద్ర వేశావు

మాటల్లో పదును చేష్టలలో అదును నేర్పి 

నా అసహ్య బ్రతుకు కోసం నేటి వరకు
ప్రతి క్షణం పరితపిస్తూ నీవు నా కను సన్నల్లో కల్పవృక్షం ఐనావు

నాకోసం రహస్య పోరాటం చేస్తూ నన్ను పతాక స్థాయీకి చేర్చినపుడు

నేను గర్వించే వేళా అదృశ్యం ఐనావు
నా హృదిలో చిరస్తాయీగా నిలిచావు

ఇది నా కల్పన కావ్యం కాదు,అసలు ఇవి నా అక్షరాలు కాదు

ఇవి నీ కోసం చిందిస్తున్న నా రక్త కన్నీటి బిందువులు.

Thursday 16 October 2014

నిర్భయ

              నా అశ్రుతాంజలి


కర్మ భూమికి కామపు మబ్బులు కమ్మాయా?
పుణ్య భూమిలో కోరలు మొలిచాయా?
మానవత్వం మంట కలిసిందా?
కామాందులు విర్రసుగుతున్నారా?

ఆర్తనాదాలు ముగావి ఐపోయెన వేళలో
నీ రక్త సిక్త దేహాన్ని బాగు చేసే వైద్యుడేడి?
పోటెత్తిన బడ తప్త హృదయలున్నా
నీ నయన బాష్పాలను తుడవలేకపోనవి

ఈ గారాల దేశంలో నీకు తావులేదని
తల్లడిల్లి నీ మానాప్రానాలు వదిలావా?
యావత్ ప్రపంచం ఒక్కటిగాఐనా  నీ ప్రాణం నిలుపలేదు
సువర్ణాక్షారాల చేకటి దుర్దినం ఇది

మహాత్ముడు కూడా విన్నాడు నీ మరణ ఘోష
తనను తాను స్మరించుకున్నాడు ఎంత ఘోరం అని
ఇది ప్రజా ప్రస్థానం కాదు విష కోరల ఆస్థానం
అమరురాలు ఐనా నిర్భయ అందుకో నా అశ్రుతాంజలి 

నా శ్వేత గులాబీ

       
        నా శ్వేత గులాబీ

నా మగువ మేని నిప్పులోని వెలుగు
నా ప్రేయసి చూపు ఆకస మబ్బుల చల్లదనం
నా ప్రియురాలి స్వరం అదృశ్య తరంగం
నా చెలి హస్తం రుగ్మతను పోగొట్టే వనమూలిక

ఏదో ఉద్విగ్నత కలయీక
ఇంకేదో ఆవిరి పొగల స్పర్స
తడిచినాను పసిపాపను ఐ
తన మేని చిరు చెమటలో

నా వుహకందని అద్భుత సృష్టి
మరిగే నెత్తురు లోని కణము ఏమో
తెలుగింట ఉలిక్కి పడే అమ్మాయి లా
నే మెచ్చే గొంతులో స్వేచ్చా గీతం

పరిమలిమ్చని కనకాంబరం పై వాలిన తునీగా
విరబూసిన వనం లో "శ్వేత గులాబీ" ఐ
"లాం" తరానా ఉద్భవించిన నీటిముత్యం
ఇన్ని వర్ణనల కలబోతే నాజీవిత భాగస్వామి

నా అక్షరం

    నా  అక్షరం  

నా అక్షరం

 ప్రాణo పోసిన అమ్మ కి  ‘తనయుడు’

నా అక్షరం

 విద్య బుద్ధులు నేర్పిన ‘గురు దేవుడు’

నా అక్షరం

    పిడికిలి బిగించిన ఓ ‘యువకుడు’

నా అక్షరం

     ప్రాణం పనంగా పెట్టే ‘స్నేహితుడు’

నా అక్షరం

     చెలి ఒడిలో సేద తీరే ‘ప్రియుడు’

నా అక్షరం

    వ్యవస్థను రూపుమాపే ‘నాయకుడు’

నా అక్షరం

   కండలు కరిగేలా శ్రమించే ‘శ్రామికుడు’

నాఅక్షరం

    దేశానికీ ప్రాణం అర్పించే ‘సైనికుడు’

నా అక్షరం

   మృగలోకం మధ్యవున్న ‘మానవుడు’

నా అక్షరం

      సమస్యలను సాధించే ‘సామాన్యుడు’

నా అక్షరం

    మృత్యువును జయించిన ‘విజయ్’డు

Wednesday 15 October 2014

నా నేత

                           నా నేత
జగజ్జేత అంబేద్కర్
జాతి పిత బి ఆర్ అంబేద్కర్
దళిత జననేత అంబేద్కర్
దళితులకు దైవం అంబేద్కర్

దళిత ఆకలి మంటల అరుపుల నుండి
క్షుద్ర,అట్టడుగు వర్గాల ములల నుండి
మహా అరునోదయాన్ని చూపిన ఆదర్సమూర్తి


అస్పృశ్యతను అధః పాతలమంటూ
ఈ అంటరని తనపు సంకెళ్ళని విరిచి,
మా దళిత జాతి కీర్తిని దశ ధిశాల్లోను
దేశ రాజ్యంగా సృష్టి కర్తగా ఎదిగి ఒధిగిన
ఈ అభినవ ఆదర్శ మూర్తికి వందనం అభివందనం

అమ్మ

           అమ్మ



    కన్ను తెరిస్తే జననం
    కళ్ళు మూస్తే మరణం
    రెప్ప పాటు ఈ జీవితం సమస్యల ఝరీ ప్రవాహం
          అనునిత్యం లోకం నెడుతున్నా
         తన ఉదరం ఫై నేను కొడుతున్నా
         బాధను భావిద్వేగంతో భరిస్తూ
         ప్రసవ వేదన జ్వాలాగ్నిలో
        తన నరాలే రాగి తీగలైన క్షణాన
         నేను నీ కంటి పాపనంటు
         జీవన్మ్రుత సమయంలో

        నాకు జీవాన్ని పోసిన బ్రహ్మ మా అమ్మ

ABOUT ME

                                         హాయ్ నా స్నేహితులారా! 
విజయ్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు.ఒక్కసారి నా మొరవినండి ప్రతి జీవికి ఒక్కో ప్రత్యేకతతో జీవం పోస్థాడు.ఎవరి ప్రత్యేకత ఎంటో తెలుసుకున్న వ్యక్తి జీవితం లో రానించాడు అంటారు.నా జీవితం లో ఎన్నో సమస్య లను
అదిగమిస్తు అందరు వున్న కూడా నా అనుభవాలను,నా ఆలోచనలను, ముఖ పరిచయం లేకున్నా,వున్నా,నా ఈ నూతన ప్రస్తానానికి ఒకర ప్రయోగం చేయబోతున్నా.అందరు అధరిస్తారని,ఆశిస్తూ,నన్ను ముందుకు నడిపి ఒక అవకాశం (నా మేధస్సు కి) వుంది అని గుర్తిస్తారని తపన పడుతూ,నాలో నేనే అనుభవిస్తున్న నా కృషిని గుర్తిస్తారని "విజయ్"యొక్క మనవి.
ముందుగా
మానవుడు తను అనుకున్నది సాధించాలంటే కావల్సినవి నాలుగు.
అవి
1.అవకాశం
2సాధించాలి అనే తపన
3ఆత్మీయుల సహకారం
4పటిష్టం ఐనా ప్రణాళిక.
అవునా?
కాదా?