బంధించబడిన నా ప్రేమ బంధాలు తుణకలైనాయీ,
నా జీవిత అంకం ముగిసిందని నిర్ధారణకు వచ్చి,
సమస్త వ్యసనాలన్ని వదిలేసిన ఆ ఘడియన,
ఆశ్చర్యం వ్యక్తం చేసింది, నా దిగంబర తనువు.
అమూల్యమైన ఆప్యాయతలకు లోబడిన నా ప్రాణం
ఆనందసాగరంలో మునిగిన నా అనుభూతులన్ని
జీవిత యాత్ర నుండి మేల్కొని అర్దించినపుడు
స్మశాన వాటికకు మధుర యాత్రను జరిపాయీ.
ఎంతో కొంత తృప్తితో సంబరపడిన నా చావు
వ్యామోహ సుడిల నుండి బయటకు విసిరినపుడు
ప్రశాంతత నిచ్చేoదుకు భగవంతుడిచ్చిన వరం
విధ్వంసం సృష్టించే భయంకర మరణము .
ఇది ఒక్కసారిగా వచ్చిన నా మరణ తుఫాన్
పరిగణనలోకి రానివ్వని విపత్కర పరిస్థితుల్లో
తొణికిసలాడిన పెదవుల చివరి పలుకు
"నా మాతృమూర్తి"కి మానసిక "శాంతి "ని ఇవ్వు.
No comments:
Post a Comment